ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: పోలాకి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో సామాన్యులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.