VIDEO: ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలోని టిడ్కో గృహ సముదాయం వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాంగ్ రూట్‌లో వస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.