'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి'
JGL: ధర్మపురి మండలం రాజారాం, దమ్మన్నపేట్, దుబ్బల గూడెం గ్రామాల్లోని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్. లత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. రైతుల వివరాలను ముందుగానే తీసుకోవాలని సెంటర్ ఇంఛార్జ్‌లకు సూచించారు.