జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి .. పోలీసులకు ఫిర్యాదు

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి .. పోలీసులకు ఫిర్యాదు

గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఈ రోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో దాడి జరిగినట్లు నాయకులు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ యువ మోర్చా పేరుతో కొందరు వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా వచ్చి రాళ్లు, కోడిగుడ్లు విసిరి పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.