కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు

కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు

SRD: కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాణిక్ అన్నారు. పటాన్ చెరు శ్రామిక్ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై మొదట సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.