రాష్ట్రంలోనే మోడల్ పీఎస్‌గా ఏలూరు: హోంమంత్రి

రాష్ట్రంలోనే మోడల్ పీఎస్‌గా ఏలూరు: హోంమంత్రి

AP: రాష్ట్రంలోనే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మోడల్‌గా నిలుస్తోందని హోంమంత్రి అనిత అన్నారు. మహిళా పీఎస్‌ను ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కాకుండా కౌన్సెలింగ్ సెంటర్ అంటే బాగుంటుందని, కష్టం వస్తే ఆడపిల్ల ధైర్యంగా సమస్య చెప్పుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అన్ని పీఎస్‌ల ఆధునీకరణతోపాటు ప్రక్షాళన చేస్తామన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.