పార్థివ దేహానికి నివాళులర్పించిన టీడీపీ నేత
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం రాఘవరాజు పురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దొంతిరెడ్డి వెంకటేష్ రెడ్డి మంగళవారం మరణించారు. ఆయన పార్థివ దేహానికి రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ బాధ్యులు, కుడా ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు.