సహకార వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
KNR: 72వ అఖిలభారత సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. సహకార సంఘాల ద్వారా సమృద్ధి సాధించడానికి ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఈ సహకార వారోత్సవాల్ని ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ వారం రోజులు ఒక్కొక్క నాడు ఒక్కొక్క అంశాన్ని స్వీకరించి సభలు సమావేశాల జరుగుతాయన్నారు.