ప్రొద్దుటూరులో సీపీఐ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం

KDP: భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ప్రొద్దుటూరులో సీపీఐ నేతలు ఘనంగా నిర్వహించారు. గురువారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. శివాలయం సర్కిల్ వద్ద సీపీఐ కార్యవర్గ సభ్యులు రామయ్య జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిందన్నారు.