రేపటి నుంచి టెట్ పరీక్షలు
ప్రకాశం: జిల్లాలో ఈ నెల 10 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ పరీక్షల నిర్వహణపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 810 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. వీటి కోసం 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.