ఒకే కాన్పులో ముగ్గురు ఆడ శిశువులు జననం
HNK: హన్మకొండ నగరంలోని ప్రభుత్వ మిషన్ ఆసుపత్రిలో సోమవారం ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల గర్భిణి సిజేరియన్ ద్వారా ముగ్గురు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. వారిలో ఇద్దరు 2 కిలోల బరువుతో, మరొకరు 900 గ్రాముల బరువుతో జన్మించినట్లు వైద్యులు తెలిపారు. తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యురాలు రమాదేవి వెల్లడించారు.