'పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.