కావలి ఆర్డిఓకు శుభాకాంక్షలు తెలిపి మాజీ ఎమ్మెల్యే వంటేరు

NLR: కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి వంశీ కృష్ణని ఆయన నివాసంలో సోమవారం కావలి మాజీ శాసన సభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి పూల బొకే అందజేసి నూతన సంవత్సర, సంక్రాంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కావలి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఆర్డీవోని ఆయన కోరారు. కోరుకున్న జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు.