స్కూటీని ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

స్కూటీని ఢీకొట్టిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

AKP: అచ్యుతాపురం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏడ్ల సన్యాసినాయుడు (47) ఈరోజు ఉదయం తన పిల్లలను స్కూల్లో దింపాడు. తిరిగి వెళ్తుండగా.. హరిపాలెం వద్ద ఇటుకల లోడుతో ఉన్న ట్రాక్టర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సన్యాసినాయుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య ఎస్సై సుధాకర్ కేసు నమోదు చేశారు.