తెనాలిలోని ఫుడ్ షాపుల్లో అధికారుల తనిఖీలు
GNTR: తెనాలిలోని స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో మున్సిపల్ వైద్యాధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. మారీసుపేట, శివాజీచౌక్ ప్రాంతాల్లోని తినుబండారాల దుకాణాలను సందర్శించిన హెల్త్ ఆఫీసర్ ఏసుబాబు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆహార పదార్థాలపై తప్పనిసరిగా మూతలు ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యాపారులకు సూచించారు.