మన్యంకొండలో వైభవంగా స్వామివారి కళ్యాణం
మహబూబ్‌నగర్ జిల్లాలో పౌర్ణమి పురస్కరించుకుని మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ ఘట్టం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనంతో ఆలయ పరిసరాలన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి.