ధాన్యం తరలింపు.. సంతోషం వ్యక్తం చేసిన రైతులు
MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలోని IKP ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గత పది రోజులుగా ధాన్యం బస్తాలు తరలించడం లేదంటూ పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు స్పందించారు. ప్రత్యేకంగా బుధవారం లారీ ఏర్పాటు చేసి సుమారు 4000 ధాన్యం బస్తాలను తరలిస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.