జర్నలిస్ట్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం

జర్నలిస్ట్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం

HYD: ఇటీవల మరణించిన HYD సెంట్రల్ జోన్ రిపోర్టర్ నాయుడు కుటుంబానికి తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో వారి కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వ్యక్తిగతంగా నాయుడు కుటుంబాన్ని పరామర్శించి, పరితాపం వ్యక్తం చేశారు. నాయుడు పాత్రికేయ రంగానికి అందించిన సేవలను కొనియాడారు.