పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయండి: కలెక్టర్
KDP: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా వచ్చిన దరఖాస్తులకు అనుమతులు జారీ చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన డీఐఈపీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా గత త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న- మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి సంబంధించిన రాయితీల మంజూరు అంశాలను ఆయన సమీక్షించారు.