'చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'
పెద్దపల్లి ప్రభుత్వ కళాశాలలో నశాముక్త్ భారత్ ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకలకు అదనపు కలెక్టర్ దాసరి వేణు మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో జీవితాన్ని అలవర్చుకుని, తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి పేరు తెచ్చేలా వ్యవహరించాలని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి యువత జీవితాలను నాశనం చేస్తుందన్నారు.