పుంత రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు
W.G: తణుకు నియోజకవర్గంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు తణుకు, అత్తిలి ఏఎంసీల పరిధిలో పుంత రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6 పుంత రోడ్లు నిర్మాణానికి రూ.1.71 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.