కార్యకర్తల అంకితభావమే పార్టీకి శ్రీరామరక్ష: ఉషశ్రీ
సత్యసాయి: వైసీపీ 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల శ్రమ, అంకితభావమే పార్టీకి శ్రీరామరక్ష అని ఆమె కొనియాడారు. జనరంజక పాలన, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.