కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం కరెంట్ షాక్ తగిలి న్యాలం హరీష్ (35)అనే యువకుడు మృతి చెందాడు. ఇంటి ముందు ఉన్న నీళ్ళ సంపుకు కరెంట్ మోటార్‌కు వైరు తగిలి ఉండడంతో విద్యుత్ షాక్ తగిలి సంఘటన స్థలంలోనే హరీష్ మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు శ్రీహిత (9)కొడుకు అక్షయ్ (7) ఇద్దరు పిల్లలు ఉన్నారు.