హజ్ యాత్ర కోసం వాక్సినేషన్:హజ్ సొసైటీ
SDPT: హజ్ యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు హజ్ సొసైటీ అధ్యక్షుడు జియావుద్దీన్ మంజూర్ తెలిపారు. శనివారం పట్టణంలోని నిమ్రా గార్డెన్లో యాత్రికులకు వ్యాక్సినేషన్ వేయడంతో పాటు అవగాహన క్లాసులు నిర్వహించారు.యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలపై నిపుణులు శిక్షణ ఇచ్చారు.