పేకాట స్థావరాలపై దాడి.. 8 మంది అరెస్ట్
ATP: తాడిపత్రిలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చుక్కలూరు వద్ద పెన్నా నది సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.