VIDEO: ఉగాది వేళ తిమ్మప్ప స్వామికి పూజలు
GDWL: పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మల్దకల్ మండలంలోని ఆదిశిల క్షేత్రంలో తిమ్మప్ప స్వామికి గురువారం విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామున కోనేరు జలాలతో అభిషేకం చేసి అర్చన, ఆకుపూజ, హోమాలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉగాది సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.