ఘనంగా ఆంజనేయస్వామి ఆలయం ప్రారంభం

ఘనంగా ఆంజనేయస్వామి ఆలయం ప్రారంభం

అనకాపల్లి: ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. నర్సీపట్నం మండలంలోని బి.ఎస్.పేటలో రూ.10 లక్షల టీటీడీ నిధులతో నూతనంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాసు, పీఏసీఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, పార్టీ నేతలు చిటికెల రమణ, గోవింద, సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు.