VIDEO: 'చెన్నైలో శ్రీకాకుళం జిల్లా వ్యక్తి మృతి'

SKLM: సోంపేట మండలంలోని రామయ్యపట్నం గ్రామానికి చెందిన వాడ ధర్మారావు చెన్నైలోని జట్టి వద్ద అనుమానాస్పదంగా మంగళవారం మృతి చెందాడు. నీటిలో మృతదేహం పడి ఉండడంతో తోటి మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో చేపల వేట కోసం ఆయన ఇటీవల వలస వెళ్లాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.