వ్యభిచార గృహంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

WGL: వరంగల్ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయగణపతి రోడ్ నెం.15లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే, విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక విటుడితో పాటు ఒక నిర్వాహకుడు, ఇద్దరు బాధితులను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మంగళవారం తెలిపారు. వీరిని రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు.