ఎన్నికల్లో డబ్బు, మద్యంపై నిఘా: ఎస్పీ
గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరుమాల పంచాయతీలోని నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో నిఘా, పెట్రోలింగ్‌ను పెంచామని ఆయన తెలిపారు. ఎవరైనా అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.