ఆగని దాడులు.. 13 మంది మృతి

ఆగని దాడులు.. 13 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగటం లేదు. తాజాగా IDF జరిపిన దాడుల్లో 13 మంది మృతి చెందారు. మరో వైపు గాజా నగరం ఆకలితో అలమటిస్తుంది. ఈ ఆకలితో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం ఖతర్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆ దేశ ప్రధాని షేక్ మహమ్మద్ ఖండించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదన్న ప్రధాని.. హమాస్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అమెరికాకు సాయం చేయనున్నట్లు ప్రకటించారు.