అంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరు అంకాలమ్మతల్లి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చందంపేట మండలం చిత్రియాల గ్రామంలో అంకాలమ్మ తల్లి జాతర సందర్భంగా అంకాలమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.