ములుగు కేంద్రంగా ఏడు రోజులు దీక్ష చేశాం: సీతక్క

MLG: తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కూడా జైలుకు వెళ్లి వచ్చానని, ములుగులో ఏడు రోజులు దీక్ష చేశామని మంత్రి సీతక్క తెలిపారు. అసెంబ్లీలో సీతక్క మాట్లాడుతూ.. తాము నిత్యం ప్రజలలో, పోరాటాలలో ఉన్నామని, ఆ రోజైనా, నేడైనా తెలంగాణ ప్రజల కోసమే మా గొంతును వినిపించామని చెప్పుకొచ్చారు.