మ‌హేష్ మూవీ వ‌ల్లే టాలీవుడ్‌కి దూరం: రకుల్

మ‌హేష్ మూవీ వ‌ల్లే టాలీవుడ్‌కి దూరం: రకుల్

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ కలిసి నటించిన 'స్పైడర్' మూవీ డిజాస్టర్ అయింది. ఈ సినిమా తన కెరీర్‌లో వచ్చిన తొలి పెద్ద డిజాస్టర్ అని రకుల్ తాజాగా చెప్పింది. అంతకముందు తనకు వరుసగా 8, 9 హిట్ వచ్చాయని పేర్కొంది. 'స్పైడర్' రిజల్ట్ వల్ల ఒత్తిడికి గురయ్యానని, తనపై వచ్చిన విమర్శలను మానసికంగా తట్టుకోలేకపోయానని వెల్లడించింది. అందుకే టాలీవుడ్ నుంచి దూరంగా వెళ్లినట్లు తెలిపింది.