రైతులందరికీ న్యాయం చేస్తాం: మంత్రి
NDL: మొంథా తుఫాన్ ప్రభావంతో బనగానపల్లె నియోజకవర్గంలో 6,820 ఎకరాల పంట నష్టం వాటిలినట్లు గురువారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంజామల మండల కేంద్రంలో పర్యటించిన ఆయన, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అత్యధికంగా వరి, జొన్న, శనగ, మిరప పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.