అభిషేక్ శర్మ VS నాథన్ ఎల్లిస్

అభిషేక్ శర్మ VS నాథన్ ఎల్లిస్

అభిషేక్ శర్మ దూకుడైన బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. బౌలర్ ఎవరైనా సరే, బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అలాంటి అభిషేక్.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. టీ20 సిరీస్‌లో ఎల్లిస్ వరుసగా 3 మ్యాచ్‌ల్లో శర్మను ఔట్ చేశాడు. దీంతో రేపటి మ్యాచ్‌లో వీరి మధ్య పోరు ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.