ధర్మకర్తల కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం
BHPL: మహాదేవపూర్(M) కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. నూతన ధర్మకర్తల మండలి సభ్యులను కాటారం మార్కెట్ ఛైర్‌పర్సన్ తిరుమల సమ్మయ్య సన్మానించారు.