పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
Srcl: తంగళ్ళపల్లిలోని పోలీస్ స్టేషన్‌ను సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే శుక్రవారం తనిఖీ చేశారు. ఆయుధాలను పరిశీలించి,రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ రౌడీ షీటర్లను తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్సై ఉపేంద్ర చారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.