ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆరోపణలు

NLR: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై ఆరోపణలు చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.