మంచినీరు అందించాలంటూ ధర్నా

W.G: నరసాపురం మండలం మల్లవరంలక గ్రామంలో గత ఐదు రోజులుగా మంచినీరు ఇవ్వకపోవడంతో మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకుడు మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ.. గ్రామంలో పైపులైన్ పగిలి ఒకటి నుంచి 4వ వార్డు వరకు ఐదు రోజులుగా మంచినీరు అందటం లేదన్నారు. సమస్య పరిష్కరానికి అధికారులు స్పందించాలన్నారు.