హోంగార్డుపై దాడి చేసిన 9 మందిపై కేసు
W.G: ఈనెల 8న రాత్రి ఆర్యపేట గ్రామం పెదపేటలో రోడ్డుపై కొంతమంది వ్యక్తులు బహిరంగంగా మద్యం తాగుతూ గొడవ చేస్తున్నారని యలమంచిలి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. దీంతో హోంగార్డు దిగమర్తి సత్యనారాయణ అక్కడికి చేరుకుని వారిని మందలించగా, అతనిపై దాడి చేశారు. హోంగార్డు ఫిర్యాదుతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని డీఎస్పీ శ్రీవేద సోమవారం తెలిపారు.