VIDEO: పేద కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

SRPT: తుంగతుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మిక మండల అధ్యక్షుడు యలగందుల రమేష్ ఇటీవల మరణించడంతో ఆ కుటుంబానికి జీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 50 కేజీల బియ్యం అందజేశారు. అనంతరం రమేష్ కుటుంబ సభ్యులను జీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అంబటి ప్రసన్న, గోపగాని వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.