రెవెన్యూ ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం

రెవెన్యూ ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయ లోపం

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం రాయవరం గ్రామంలో గురువారం ఫారెస్ట్ రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వే నెంబర్ 98లో సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు రాగా ఫారెస్ట్ అధికారులు రాకపోవడంతో ఆ పనులు ముందుకు సాగలేదు. దీంతో రైతులు ఆందోళన చెందారు.