ఆదర్శంగా నిలిచిన తండ్రి, కూతురు

ఆదర్శంగా నిలిచిన తండ్రి, కూతురు

విజయనగరంలో భార్యను కోల్పోయిన భర్త, తల్లిని కోల్పోయిన కుమార్తె పుట్టెడు దుఃఖంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మరణం తర్వాత కూడా తమ ప్రాణసమానమైన వ్యక్తి ఇతరులకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అందుకే ఆమె మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు విరాళంగా ఇచ్చారు. భావితరాల వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం వారు చేసిన ఈ త్యాగం సమాజం పట్ల వారికున్న బాధ్యతను చాటిచెప్పింది.