పాఠశాలలో చదువుతున్న బాలుడు అదృశ్యం

వరంగల్: చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బోడ గణేష్ అనే విద్యార్థి సోమవారం అదృశ్యమైనట్లు చెన్నారావుపేట ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. అతని తండ్రి బోడ వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.