జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు బదిలీ
HNK: జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. హాసన్‌పర్తి తహసీల్దార్ ప్రసాద్‌ను కలెక్టరేట్‌లోని సీ సెక్షన్‌కు, కలెక్టరేట్‌లోని సీ సెక్షన్‌లో పనిచేస్తున్న కిరణ్‌ను హాసన్‌పర్తి మండల తహసీల్దార్‌గా బదిలీ చేశారు. వీరిని డిప్యుటేషన్ ప్రాతిపదికన బదిలీ కల్పించినట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.