'ప్రముఖ గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు సరికాదు'

'ప్రముఖ గాయని మంగ్లీపై అసత్య ఆరోపణలు సరికాదు'

MHBD: ప్రముఖ గాయని మంగ్లీపై జరుగుతున్న అసత్య ఆరోపణలు సరికాదని గిరిజన సమన్వయ కమిటీ తొర్రూరు మండల అధ్యక్షుడు ధారావత్ జైసింగ్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్య గిరిజన కుటుంబం నుంచి వచ్చి తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.