VIDEO: కోస్గిలో కబ్రస్థాన్ గోడ కూల్చివేత వివాదం
NRPT: కోస్గి మున్సిపల్ కేంద్రంలో కబ్రస్థాన్ ప్రహరీ గోడ కూల్చివేత వివాదం కొత్త మలుపు తిరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా ముందస్తు సమాచారం లేకుండా గోడను కూల్చడంపై ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే, అదే చోట తిరిగి నిర్మాణం ప్రారంభించడంతో స్థానికులు అయోమయానికి గురయ్యారు. ఈ గందరగోళంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.