VIDEO: రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి: గ్రామస్తులు

MHBD: నెల్లికుదురు (M)కాచికల్ క్రాస్ నుంచి మేచరాజుపల్లి వరకు రోడ్డు పనులను కాంట్రాక్టర్ అర్ధంతరంగా వదిలేయడంతో ఎర్రబెల్లిగూడెం గ్రామస్తులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వంలో త్రవ్వకాలు ప్రారంభించి వదిలేయడంతో రోడ్లు గుంతలమయంగా మారాయని, అంబులెన్స్‌లు, ఆటోలు వెళ్లలేని దుస్థితి నెలకొందని వాపోయారు. అధికారులు వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.