లచ్చన్నపేట దగ్గర రహదారిపై ప్రమాదం

లచ్చన్నపేట దగ్గర రహదారిపై ప్రమాదం

SKLM: టెక్కలి మండలం లచ్చన్నపేట గ్రామ సమీపంలో హైవేపై మంగళవారం పలాస నుంచి జీడిపప్పు లోడుతో వెళ్తున్న మిని వ్యాను ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాసు, క్రిష్ణ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పోలీసు సిబ్బంది అంబులెన్స్‌లో క్షతగాత్రులను టెక్కలి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.